NEWSTELANGANA

హైద‌రాబాద్ లో నెల రోజుల పాటు ఆంక్ష‌లు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. నెల రోజుల పాటు న‌గ‌ర‌మంత‌టా ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

హైద‌రాబాద్ లో కొన్ని దుష్ట శ‌క్తులు అశాంతి రేపేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని , ఈ మేర‌కు ముందు జాగ్ర‌త్త‌గా ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగా ఎవ‌రు కూడా గుమిగూడేందుకు ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని , ఇబ్బందులు ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు.

అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వాస నీయ సమాచారం ఉంద‌న్నారు సీవీ ఆనంద్.

U/S 163 BNS యాక్ట్ ప్రకారం ఆంక్షలు విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీపీ. ఈ సంద‌ర్బంగా సభలు, సమావేశాలు, దర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీ లు నిషేధిస్తున్న‌ట్లు, ఇవాల్టి నుంచే ఈ యాక్ట్ అమ‌లులోకి వ‌స్తుంద‌ని చెప్పారు న‌గ‌ర పోలీస్ క‌మిష‌ణ‌ర్. ఐదు మంది కంటే ఎక్కువ‌గా ఉంటే , లేదా క‌లిసి ఉన్నా వెంట‌నే అదుపులోకి తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

ఈ ఆంక్ష‌లు వ‌చ్చే నెల న‌వంబ‌ర్ 28 వ‌ర‌కు నెల రోజుల పాటు ఆంక్ష‌లు అమ‌లులో ఉంటాయ‌ని, ఈ విష‌యాన్ని గ‌మ‌నించి న‌గ‌ర ప్ర‌జ‌లు పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని లేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని, జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు సీవీ ఆనంద్.