NEWSANDHRA PRADESH

అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

Share it with your family & friends

అమ‌రావ‌తి హైకోర్టులో కొలువు తీరిన జ‌డ్జీలు

అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.

ఈమేరకు సోమవారం హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో మహేశ్వరరావు కుంచెం (అలియాస్ కుంచం), తూటా చంద్ర ధన శేఖర్ (అలియాస్ టిసిడి శేఖర్), చల్లా గుణరంజన్ లచే అదనపు న్యాయమూర్తులుగా చీఫ్ జస్టిస్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.

హైకోర్టులో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోని పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి.పొన్నారావు, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ డా.వై.లక్ష్మణరావు, పలువులు రిజిష్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.