నటి సాయి పల్లవి భావోద్వేగం
అమరన్ చిత్రం ప్రమోషన్స్
హైదరాబాద్ – అమరన్ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ నటి సాయి పల్లవి పోలీస్ అమరవీరుల సంస్మరణ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె వీర మరణం పొందిన పోలీసులకు నివాళులు అర్పించారు. సాయి పల్లవి భావోద్వేగానికి లోనయ్యారు.
దీనిని పవిత్ర దేవాలయంగా ఆమె అభివర్ణించారు. మన కోసం, దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వకమైన నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. ఇక్కడి పేర్చిన ప్రతి ఇటుక ఓ జ్ఞాపకంగా మిగిలి పోతుందని పేర్కొన్నారు సాయి పల్లవి.
మేజర్ ముకుంద్ వరదరాజన్ , సిపాయి విక్రమ్ సింగ్ లను చూసి కన్నీటి పర్యంతం అయ్యానని వాపోయారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతతో నిండిన ధన్యవాదాలు అంటూ తెలిపారు. శివ కార్తికేయన్ తో కలిసి సాయి పల్లవి అమరన్ చిత్రంలో నటించారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం వహించారు రాజ్ కుమార్ పెరియసామి. ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ ఆధారంగా అమరన్ చిత్రాన్ని నిర్మించారు. సాయి పల్లవి, కార్తికేయన్ తో పాటు కమల్ హాసన్ , ఆర్ మహేంద్రన్ , వివేక్ కృష్ణని కూడా ఇందులో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.