ప్రిన్స్ తో రాజమౌళి మూవీ స్టార్ట్
జనవరిలో ముహూర్తం ఫిక్స్
హైదరాబాద్ – దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రముఖ సినీ నటుడు ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న మూవీపై భారీ ఎత్తున ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడెప్పుడా అని జక్కన్న , ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతున్నారు.
ఇప్పటికే రాజమౌళి అంటేనే ఆయన తీసే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రంతో యావత్ర ప్రపంచాన్ని ఒక్కసారిగా నివ్వెర పోయేలా చేశాడు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు అంతర్జాతీయ ఆస్కార్ అవార్డు దక్కింది. దీనిని తెలంగాణకు చెందిన చంద్రబోస్ రాయగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు తో తీయబోయే చిత్రం పూర్తిగా హాలీవుడ్ ను తలదన్నే రీతిలో ఉండ బోతోందని టాక్. ఈ తీయబోయే చిత్రానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియలేదు. అయితే పూర్తిగా మహేష్ బాబు హెయిర్ స్టైల్ ను మార్చేశాడు జక్కన్న.
ఇంకా పేరు పెట్టని ప్రిన్స్ మహేష్ బాబు సినిమాకు ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ29 అని పేరు పెట్టారు. వచ్చే ఏడాది 2025 జనవరిలో ఈ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని సమాచారం. మొత్తంగా ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాను రూ. 1000 కోట్లు ఖర్చు చేసి తీయనున్నట్లు టాక్.