DEVOTIONAL

స్వామీజీ కామెంట్స్ టీటీడీ సీరియ‌స్

Share it with your family & friends

నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు త‌గ‌దు

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ ) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. శ్రీకాకుళం జిల్లా, కృష్ణాపురం గ్రామంలోని శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శ్రీనివాసానంద స‌ర‌స్వ‌తి స్వామిజీ తిరుమ‌ల దేవ‌స్థానం ఉన్న‌తాధికారుల‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

తిరుపతిలో స్వామి వారు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తాము అడిగిన దర్శనం టిక్కెట్లు ఇవ్వలేదని ఆరోపించారు. తద్వారా మమ్మల్ని అవమానించారని పేర్కొన‌డం దారుణ‌మ‌ని తెలిపింది.

వాస్తవంగా సదరు స్వామీజీ వారు 50 మందికి బ్రేక్ దర్శనం , 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం తో పాటు తిరుమలలో వసతి కల్పించాలని టీటీడీ అధికారులను కోరారని వెల్ల‌డించింది. అయితే వారు అడిగిన మేరకు వసతి కల్పించేందుకు అంగీకరించడం కూడా జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేసింది టీటీడీ.

సాధారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఆరోజున దర్శనం కొరకు ఇంతమందికి ఇవ్వడం సాధ్యం కాదని 600 మంది సంఖ్య‌ను తగ్గించాలని అద‌న‌పు ఈవో కోరారని స్ప‌ష్టం చేసింది.

కాగా సదరు స్వామీజీ తాము అడిగిన 600 మందికి దర్శనం కల్పించాలని పట్టుబట్టడం జ‌రిగింది. తాము అడిగినంత మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం టిక్కెట్లు ఇవ్వ‌లేద‌నే కోపంతో మీడియా సమక్షంలో టీటీడీ అధికారిని తీవ్ర స్థాయిలో కించపరుస్తూ మాట్లాడం దారుణ‌మ‌ని, ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని తెలిపింది.

స్వామిజీ భ‌క్తుల‌కు ఆద‌ర్శ ప్రాయంగా ఉండేలా త‌ప్పా ఇలాంటి చ‌వ‌క‌బారు వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌ద‌ని హిత‌వు ప‌లికింది.