నాయకత్వానికి నమూనా పవన్ కళ్యాణ్
ప్రముఖ రచయిత..మెంటార్ శ్రీధర్ బెవరా
హైదరాబాద్ – ప్రముఖ రచయిత, మెంటార్ , మోటివేట్ స్పీకర్ శ్రీధర్ బెవరా కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి , ఆయన వ్యక్తిత్వం, నాయకత్వ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
థింక్ ట్యాంక్ సలహాదారుడిగా ఆయనతో చేసిన ప్రయాణం తనను మరింత విస్మయానికి గురి చేసేలా చేసిందని పేర్కొన్నారు. పవన్ తో గమనించ దగిన నైపుణ్యాలు చాలా ఉన్నాయని తెలిపారు. గొప్ప నాయకుడికి ఉండే మూడు ముఖ్యమైన లక్షణాలు స్పష్టత, అంచనా, నిర్ణయాత్మకత ..ఈ మూడు పవర్ స్టార్ లో పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
అతని స్పష్టత అసాధారణమైనదని, కొన్నిసార్లు మనల్ని ఆశ్యర్య పరుస్తుందన్నారు శ్రీధర్ బెవరా. ఎందుకంటే ఒకసారి అనుకొంటే, ఎవరినైనా ఎదిరించగల ధైర్యం, ఎక్కడికైనా పోగల బలం, ఎంత కష్టమైనా భరించగల శక్తి అతని సొంతం అన్నారు. అందువలన పవన్ కళ్యాణ్ తీసుకొన్న నిర్ణయాలు రామబాణంలా తిరిగి వెనక్కు తీసుకోలేనంత నిర్ణయాత్మకంగా ఉంటాయని స్పష్టం చేశారు శ్రీధర్ బెవరా.
ఈ ప్రక్రియ ఆయన అనుకొని చేసేది కాదని, అది అతడి సహజమైన తత్వమని పేర్కొన్నారు. ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా నిర్ణయాలు చేసి, ఎవరి ప్రమేయం లేకుండా దానిని అనుసరించగల సామర్థ్యం పవన్ కళ్యాణ వద్దనున్న ఒక మంచి నాయకత్వ లక్షణమని కొనియాడారు శ్రీధర్ బెవరా.
“ఒక గొప్ప నాయకుడు ముందుగా ఏదో ఒకదానిని విశ్వసించాలి, వారు ఏమి సాధించాలనే దానిపై స్పష్టత ఉండాలి, ఆపై నిర్ణయాలు ఎటువంటి రాగద్వేషాలకు లోనుకాకుండా తీసుకోవాలి. ఆ నిర్ణయాలకు కట్టుబడి, ఆ ప్రయత్నంలో అవసరమైన మార్పులు చేసుకొంటూ, అంతిమంగా చేరుకోవాల్సిన గమ్యం చేరుకోవాలి.” అంటూ తాను ఇటీవల రాసిన పుస్తకం ది రోరింగ్ లాంబ్స్ లో పేర్కొన్న వ్యాక్యాలను ప్రస్తావించారు రచయిత.