NEWSTELANGANA

ప్ర‌పంచం నివ్వెర పోయేలా భార‌త్

Share it with your family & friends

కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచాన్ని శాసించే స్థాయికి ప్ర‌స్తుతం భార‌త దేశం చేరుకుంద‌న్నారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

ఏకంగా 75 దేశాల‌కు డిఫెన్స్ (ర‌క్ష‌ణ ) ప‌రిక‌రాలు ఎగుమంతి చేస్తున్నామ‌ని, ఇది న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలో కేంద్ర స‌ర్కార్ సాధించిన ఘ‌న‌త అని స్ప‌ష్టం చేశారు గంగాపురం కిష‌న్ రెడ్డి. దేశ అభివృద్దికి యువ శ‌క్తిని ఉప‌యోగించు కోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు.

2047 వరకు వికసిత్‌ భారత్‌ కోసం శక్తి సామర్థ్యాలు సమకూర్చు కోవాలని, ఆ దిశ‌గా ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు గంగాపురం కిష‌న్ రెడ్డి. ఉగ్ర మూలాలను ఉక్కుపాదంతో అణచి వేశామ‌ని చెప్పారు. ఇప్పుడు ఎక్క‌డ చూసినా అభివృద్ది దిశ‌గా ప‌రుగులు తీస్తున్న భార‌త దేశం క‌నిపిస్తోంద‌ని అన్నారు.

అన్ని వ‌ర్గాల‌కు మేలు చేకూర్చేలా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, 2029 నాటికి తిరిగి తామే ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని, ఇప్ప‌టి నుంచే తాము దేశాన్ని మ‌రింత ముందుకు ఎలా తీసుకు వెళ్లాల‌నే దానిపై ప్ర‌ణాళిక‌లు త‌యారు చేసే ప‌నిలో ఉన్నామ‌ని చెప్పారు గంగాపురం కిష‌న్ రెడ్డి.