అమెరికా బాగుండాలంటే కమలా గెలవాలి
పిలుపునిచ్చిన మాజీ చీఫ్ బరాక్ ఒబామా
అమెరికా – అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు హోరా హోరీగా కొనసాగుతున్నాయి. నువ్వా నేనా అనే రీతిలో కొనసాగుతోంది ప్రచారం. ఈ సందర్బంగా జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు కమలా హారీస్ కు మద్దతుగా యుఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.
అమెరికా భవిష్యత్తు బాగుండాలంటే కమలా హారీస్ గెలవాలని, లేక పోతే భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటారని, ఆమె మీ అందరి భవిష్యత్తు కోసం రేయింబవళ్లు పని చేస్తారని హామీ ఇచ్చారు.
డొనాల్డ్ ట్రంప్ తన గురించి మాత్రమే ఆలోచిస్తాడని, దీని వల్ల ఆయనకు , తన పరివారానికి మాత్రమే బాధ్యత వహిస్తాడని, మిగతా అమెరికన్ ప్రజల గురించి ఆలోచించడని సంచలన కామెంట్స్ చేశారు బరాక్ ఒబామా.
ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు అత్యంత ప్రభావితం చూపుతాయని, మీకున్న విలువైన ఓటును కమలా హారీస్ కు వేయాలని, అమెరికా మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. మరి నాలుగేళ్ల పాటు డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి నాయకత్వం వహించాల్సిన అవసరం లేదన్నారు.