మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కు గ్రాండ్ వెల్ కమ్
స్వాగతం పలికిన ఎంపీ కేసినేని , ఎమ్మెల్యే
అమరావతి – భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నిఖంజ్ ఏపీలో కాలు మోపారు. ఆయనకు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తో పాటు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి దండమూడి శ్రీనివాస రావు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వెంటనే వెల్ కమ్ చెప్పారు.
భారత దేశం గర్వించ దగిన క్రికెటర్లలో కపిల్ దేవ్ ఒకరు. భారత దేశానికి 1983లో తొలిసారి ప్రపంచ కప్ ను తీసుకు వచ్చిన ఘనత కూడా ఆయనదే. ఆ తర్వాత ఎన్నో విజయాలలో పాలు పంచుకున్నారు. ప్రస్తుతం గోల్ఫ్ ఆటతో పాటు క్రికెట్ రంగంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
ఇదిలా ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో కలిసిన కూటమి సర్కార్ కొలువు తీరింది. ఈ సందర్బంగా అపారమైన అనుభవం కలిగిన కపిల్ దేవ్ సలహాలు, సూచనలు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు కపిల్ దేవ్ మర్యాద పూర్వకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నట్లు సమాచారం.
అందుకే ఆయనకు ఆహ్వానం పలికారని, ఇందులో కీలక పాత్ర ఎంపీ కేశినేని శివనాథ్ వహించినట్లు సమాచారం. మొత్తంగా అత్యంత నిబద్దత కలిగిన క్రికెటర్ గా పేరు పొందిన కపిల్ ఏపీకి రావడం శుభ సూచకమని చెప్పక తప్పదు.