NEWSTELANGANA

ఈఆర్సీ నిర్ణ‌యం ప్ర‌జ‌ల విజ‌యం

Share it with your family & friends

నేడు..రేపు సంబురాలు జ‌ర‌పాలి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి (టీజీఈఆర్సీ) . ఈ మేర‌కు ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన ఛార్జీల పెంపుద‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఒప్పుకునేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు ఒప్పుకోమ‌ని , పాత విద్యుత్ ఛార్జీలే కొన‌సాగుతాయ‌ని పేర్కొంది. దీంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి కోలుకోలేని దెబ్బ‌గా చెప్ప‌వ‌చ్చు.

ఇదిలా ఉండ‌గా ఈఆర్సీ నిర్ణ‌యం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంగ‌ళ‌వారం ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఈఆర్సీ కి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇది బీఆర్ఎస్ సాధించిన విజ‌య‌మ‌ని పేర్కొన్నారు.

రూ. 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో విజయం సాధించినందుకు నేడు, రేపు బీఆర్ఎస్ సంబరాలు జ‌రుపుకోవాల‌ని కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో సంబరాలు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు కేటీఆర్.

తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ చైర్మన్, సభ్యులు రంగారావు , మనోహర్ రాజు , కృష్ణయ్య కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అదనపు భారం ప్రజలపై మోపడం ప‌ట్ల హైదరాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల‌లో జ‌రిగిన మూడు బహిరంగ విచారణలలో తాము తీవ్రంగా వ్య‌తిరించ‌డం జ‌రిగింద‌న్నారు.