ఆస్తులు పంచారనేది అబద్దం – విజయమ్మ
వైవీఎస్..విజయ సాయి రెడ్డిపై సీరియస్
అమరావతి – వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల వివాదంపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకున్న తరుణంలో స్పందించారు. మంగళవారం విజయమ్మ లేఖ విడుదల చేశారు. తన భర్త , దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో ఆస్తులు పంచారనేది అవాస్తమని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ నేతలు టీటీడీ మాజీ చైర్మన్ , ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం లేదని పేర్కొన్నారు వైఎస్ విజయమ్మ. తమకు ఇద్దరు పిల్లలు సమానమని తెలిపారు.
ఆస్తులు కూడా ఇద్దరికి సమానమేనని అన్నారు. ఆస్తుల వివాదం వారిద్దరే పరిష్కరించు కుంటారని వెల్లడించారు. అయితే తమ కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని లేఖలో విజయమ్మ కుండ బద్దలు కొట్టారు.
ఇదిలా ఉండగా వాటాలు ఇచ్చేది లేదంటూ కోర్టుకు ఎక్కారు వైఎస్సార్సీపీ చీఫ్ , మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి. తల్లికి, చెల్లెలుకు ఇవ్వనంటూ స్పష్టం చేశారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చేశారు వైఎస్ షర్మిల.