అమెరికా భవిష్యత్తు కోసం మేం అంకితం
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బరాక్ ఒబామా
అమెరికా – అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా బరాక్ ఒబామా ఓటు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందనే దానిపై ప్రత్యేకంగా గుర్తు చేశారు.
అమెరికా దేశ భవిష్యత్తు కోసం తాము అంకితం అయ్యామని, ఏ రోజు కూడా ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా చూశామని చెప్పారు బరాక్ ఒబామా. ఓటు అనేది వజ్రాయుధమని, దానిని పని చేసే వారికి వేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం అధ్యక్ష పోటీల్లో నిలిచిన మాజీ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గనుక మీరు ఓటు వేసినట్లయితే దేశ భవిష్యత్తుకు భంగం కలుగుతుందన్నారు. కమలా హరీస్ దేశ భవిష్యత్తు కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
తాము అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నామని, కానీ ట్రంప్ మాత్రం తన స్వార్జితం తప్ప ఇంకోటి ఉండదన్నారు బరాక్ ఒబామా.