ఎన్నికల ఏర్పాట్లపై స్మితా సబర్వాల్ ఆరా
ఎన్నికల పరిశీలకురాలిగా ఈసీ నియామకం
మహారాష్ట్ర – తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఎన్నికల పరిశీలకురాలిగా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ సందర్బంగా ఈసీఐ బుల్దానా, మల్కాపూర్ ఏసీలకు జనరల్ అబ్జర్వర్ గా నియమించడంతో రంగంలోకి దిగారు.
బుధవారం విధి నిర్వహణలో భాగంగా స్మితా సబర్వాల్ మల్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. పోలీంగ్ స్టేషన్ల నిర్వహణ గురించి ఆరా తీశారు.
ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని, ఏర్పాట్లు ఘనంగా చేపట్టాలని ఆదేశించారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. ఇదిలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసింది.
మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీనియర్ ఆఫీసర్లను ఎన్నికల పరిశీలన అధికారులుగా నియమించింది. ఇందులో భాగంగానే స్మితా సబర్వాల్ కు బాధ్యతలు అప్పగించింది.