DEVOTIONAL

శ్రీ‌వారి విశేష ప‌ర్వ దినాలు

Share it with your family & friends

ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగే కార్య‌క్ర‌మాలు

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కోట్లాది మంది భ‌క్తులు భావించే తిరుమ‌ల పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌లో వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నెల‌లో శ్రీ‌వారి ప‌ర్వ దినాల గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ).

ఫిబ్ర‌వ‌రి 9న శ్రీ పురంద‌ర‌దాసుల ఆరాధ‌నోత్స‌వం జ‌ర‌గ‌నుంది. 10న తిరుక‌చ్చినంబి ఉత్స‌వ ఆరంభం, 14న వ‌సంత పంచమి చేప‌ట్ట‌నున్న‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. ఫిబ్ర‌వ‌రి 16న ర‌థ స‌ప్త‌మి, 19న తిరుక‌చ్చినంబి శాత్తు మొర‌, 20న భీష్మ ఏకాద‌శి , 21న శ్రీ కుల‌శేఖ‌ర ఆళ్వార్ వ‌ర్ష తిరున‌క్ష‌త్రంతో పాటు 24న కుమార ధార తీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణ‌మి గ‌రుడ సేవ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని తెలిపింది.

ఉత్స‌వాలు, కార్య‌క్ర‌మాల ప‌ర్వ దినాల‌ను పురస్క‌రించుకుని భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు పేర్కొంది టీటీడీ. ఇదిలా ఉండ‌గా రోజు రోజుకు భ‌క్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. సెల‌వు రోజుల్లో ఈ సంఖ్య పెరుగుతోంది. రోజుకు క‌నీసం 60 నుంచి 70 వేల మంది భ‌క్తులు ద‌ర్శించుకుంటున్నారు పుణ్య క్షేత్రాన్ని.