కౌశిక్ రెడ్డిపై భగ్గుమన్న ఎంపీ..ఎమ్మెల్సీ
ముఖం చాటేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నేను, ఎమ్మెల్సీ కలిసి ఆస్పత్రికి వచ్చాం. మేం డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
దాదాపు ఆస్పత్రిలోనే 2 గంటలకు పైగా వేచి ఉన్నామని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకు సవాల్ చేశారో చెప్పాలన్నారు. లేని పోని ఆరోపణలు చేయడం, ఆ తర్వాత నాలుక కర్చుకోవడం గులాబీ నేతలకు అలవాటుగా మారిందన్నారు.
తను చేసిన సవాల్ ప్రకారం రావాల్సిన కౌశిక్ రెడ్డి ఎందుకు రాలేక పోయారని ప్రశ్నించారు ఎంపీ, ఎమ్మెల్సీ. విచిత్రం ఏమిటంటే కౌశిక్ రెడ్డి తనతో పాటు తమ బాస్ , డ్రగ్స్ దందా నడిపే కేటీఆర్ ను కూడా తీసుకు వస్తానని చెప్పాడని మరి ఎందుకు రాలేక పోయారో చెప్పాలని డిమాండ్ చేశారు అనిల్ కుమార్ యాదవ్, బల్మూరి వెంకట్.
హైదరాబాదులో ఒక సామెత ఉంది అరే వీడు సలీం ఫేక్ లాగా అన్ని ఫేకుతుంటాడు అని… బీఆర్ఎస్ లో సలీం ఫేకు లాగా కౌశిక్ రెడ్డి ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అంత సీన్ లేదన్నారు ఎంపీ, ఎమ్మెల్సీ.