SPORTS

గోల్ఫ్ కోర్స్ క్ల‌బ్ ల ఏర్పాటుపై ఫోక‌స్

Share it with your family & friends

సీఎం చంద్ర‌బాబుతో క‌పిల్ దేవ్ భేటీ

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ క‌పిల్ దేవ్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా మాజీ స్కిప్ప‌ర్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు ఏపీ సీఎం.

ఎక్స్ వేదిక‌గా బుధవారం నారా క‌పిల్ దేవ్ స్పందించారు. ఇవాళ మ‌న లెజెండరీ క్రికెటర్ , ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మిస్టర్ కపిల్ దేవ్ తో పాటు ప్రతినిధి బృందంతో సమావేశం కావడం ఆనందంగా ఉందన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ , అనంతపురం, వైజాగ్‌లలో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్‌లను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించడం జ‌రిగింద‌న్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగాన్ని విస్తరించడం గురించి విస్తృతంగా చ‌ర్చించిన‌ట్లు తెలిపారు.

ఇది మన యువతలో గోల్ఫ్ క్రీడా రంగం పట్ల మక్కువను పెంపొందిస్తుందన్నారు. తదుపరి తరం గోల్ఫ్ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మన పౌరులకు ఇలాంటి మరిన్ని అవకాశాలు, సౌకర్యాలను కల్పించేందుకు ఏపీ స‌ర్కార్ కట్టుబడి ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా నైపుణ్యానికి నిజమైన హబ్‌గా మార్చడానికి క్రీడా చిహ్నాలతో సహకరించడానికి తాము ఎదురు చూస్తున్నామన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇదిలా ఉండ‌గా సీఎంతో భేటీ కావ‌డం సంతోషం క‌లిగించింద‌ని తెలిపారు క‌పిల్ దేవ్.