NEWSANDHRA PRADESH

బాబు వ‌చ్చిండు..క‌రువు తెచ్చిండు

Share it with your family & friends

ఎద్దేవా చేసిన విజ‌య సాయి రెడ్డి

అమ‌రావ‌తి – వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. ఆయ‌న రాక‌తోనే ఏపీలో క‌రువు స్టార్ట్ అయ్యింద‌న్నారు. బుధ‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స‌ర్వ నాశ‌నం అయ్యింద‌ని పేర్కొన్నారు.

చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి అని దానిని గుర్తిస్తే మంచిద‌ని అన్నారు. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయ‌ని ఆవేద‌న చెందారు విజ‌య సాయి రెడ్డి.

ఐదు జిల్లాలలోని 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోయారు వైసీపీ ఎంపీ. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి నెల‌కొంద‌ని పేర్కొన్నారు.

వైయస్సార్సీపి హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశామ‌ని, టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని పక్కన పెట్టి రైతుల ఉసురు తీసుకుంటున్నారని ఆరోపించారు.