NEWSTELANGANA

చిట్టి నాయుడు నువ్వా కేసీఆర్ ను చెరిపేసేది..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. త‌న తండ్రి, తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడు, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి అవాకులు చెవాకులు పేలిన సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ఏడాది లోపు కేసీఆర్ పేరును తెలంగాణలో నామ రూపాలు లేకుండా చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు సీఎం. ఆయ‌న చేసిన కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్నారు . నీకు అంత సీన్ లేద‌న్నారు. బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డికి మంచి పేరు కూడా పెట్టింద‌నే విష‌యం గుర్తు పెట్టుకో అన్నారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు బాట‌లో పాల‌న సాగిస్తున్న రేవంత్ రెడ్డి పేరును చిట్టి నాయుడుగా మార్చేశారు.

ప్ర‌ధానంగా కేటీఆర్ ఎక్క‌డ‌, ఎప్పుడు మాట్లాడినా రేవంత్ రెడ్డి గురించి కీల‌క , సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. త‌న తండ్రి పేరును చెరిపేస్తానంటూ కామెంట్ చేయ‌డాన్ని తీవ్రంగా తప్పు ప‌ట్టారు కేటీఆర్. నీకంత సీన్ లేద‌న్నారు.

నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు.. కేసీఆర్ ఉన్న పదవిని తృణ ప్రాయంగా వదిలేసాడని, నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడని మ‌రిచి పోతే ఎలా అని నిల‌దీశారు కేటీఆర్.

నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపెటందుకు బ్యాగులు మోస్తున్న నాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోసాడని అన్నారు.

చిట్టినాయుడు..నువ్వా! KCR (కేసీఆర్) పేరును తుడిచేది..? తెలంగాణ అంటేనే కేసీఆర్. కేసీఆర్ అంటేనే తెలంగాణ‌.