నవంబర్ 30 లోగా కుల గణన పూర్తి చేయాలి
స్పష్టం చేసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబం ఒక మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుందని స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి.
కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్ ను నియమించాలని ఆదేశించారు సీఎం. మీరంతా బాధ్యతతో పని చేయాలని, మీరు చేసే పనిపై అందరి దృష్టి ఉంటుందన్నారు .
మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుందని , ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. నవంబర్ 30లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఎ. రేవంత్ రెడ్డి.
కులగణన ఎక్స్ రే మాత్రమే కాదని, రాబోయే కాలానికి రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. భవిష్యత్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్ ను పరిగణనలోకి తీసుకునేలా దీనిని చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఇదే మోడల్ డాక్యుమెంట్ ను కేంద్రానికి పంపుతామంటూ ప్రకటించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.