NEWSANDHRA PRADESH

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్

Share it with your family & friends

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కుట్ర పెద్ద జోక్

అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. త‌న‌పై, త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్న వైసీపీ బ్యాచ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని పేర్కొన్నారు.

ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు.. 32 కోట్లు విలువ జేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమేన‌ని స్ప‌ష్టం చేశారు. షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవని అన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. స్టేటస్ కో ఉన్నది షేర్స్ మీద కాదు. గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీఅటాచ్ చేసినప్పటికీ..
వాటి షేర్లు.. స్టాక్ మార్కెట్ లో ట్రెండింగ్, బదిలీలను మాత్రం ఆప లేద‌ని అన్నారు ష‌ర్మిలా రెడ్డి.

2016 లో ఈడీ భూములను అటాచ్ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదని వింతగా మీరు చెప్పడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. 2019 లో త‌న‌కు 100 శాతం వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఎంఓయూ మీద సంత‌కం చేసింది వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు.

అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని ? 2021 లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్ కి చెందిన , సరస్వతి షేర్లను 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారు ? అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని ? అపుడు స్టేటస్ కో ను ఉల్లంఘించినట్లు కాదా అని నిల‌దీశారు.

2021 లో జగన్ , భారతి రెడ్డి తమ షేర్స్ పై సంతకం చేసి, విజయమ్మకు ఫోలియో నెంబర్లతో సహా రాసి గిఫ్ట్ డీడ్ ఇచ్చారని తెలిపారు. ఇచ్చే ముందు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని..? షేర్స్ ట్రాన్స్ఫర్ కి , బెయిల్ రద్దుకు సంబధం లేదని మీకు కూడా తెలుసు కాబట్టే అప్పుడు అవి చేశారు. ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.