DEVOTIONAL

తిరుమ‌ల పుణ్య క్షేత్రం ‘నాయుడు’ ప‌రం

Share it with your family & friends

24 మందికి స‌భ్యులుగా టీటీటీలో చోటు

అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉండ‌గా ఎంపిక చేసిన స‌భ్యుల వివ‌రాలు ఇలా ఉన్నాయి. జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంత్ రెడ్డి, మ‌డ‌క‌శిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, జాస్తి పూర్ణ సాంబ‌శివ‌రావు (ఆంధ్ర‌), తెలంగాణ టీడీపీ సీనియ‌ర్ నేత న‌న్నూరి న‌ర్సిరెడ్డి, శ్రీ సదా శివ రావు న‌న్న‌ప‌నేని, త‌మిళ‌నాడుకు చెందిన కృష్ణ‌మూర్తిని ఎంపిక చేసింది ఏపీ స‌ర్కార్.

వీరితో పాటు కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, జంగా కృష్ణ‌మూర్తి, క‌ర్ణాట‌క‌కు చెందిన ద‌ర్శ‌న్ ఆర్ ఎన్, జ‌స్టిస్ హెచ్ ఎల్ ద‌త్, త‌మిళ‌నాడుకు చెందిన శాంతా రామ్ , పి. రామ్మూర్తి , జాన‌కీ దేవి త‌మ్మిశెట్టి, తెలంగాణ‌కు చెందిన బూంగునూరు మ‌హేంద‌ర్ రెడ్డి, అనుగోలు రంగ‌శ్రీ‌, బూర‌గాపు ఆనంద‌సాయి , సుచిత్ర ఎల్ల‌, క‌ర్ణాట‌క‌కు చెందిన న‌రేశ్ కుమార్, గుజ‌రాత్ కు చెందిన డాక్ట‌ర్ ఆదిత్ దేశాయ్, మ‌హారాష్ట్ర‌కు చెందిన సౌర‌బ్ హెచ్ బోరా ను నియ‌మించింది.