ఏపీలో భారీగా ప‌తంజ‌లి పెట్టుబ‌డులు

Share it with your family & friends

సీఎం బాబుతో రామ్ దేవ్ బాబు భేటీ

అమ‌రావ‌తి – ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త పతంజ‌లి సంస్థ అధినేత రాం దేవ్ బాబా మర్యాద పూర్వ‌కంగా ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా విస్తృతంగా చ‌ర్చించారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

వ్య‌వ‌సాయం, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యా, ఆరోగ్య త‌దిత‌ర రంగాల‌లో ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టాల‌ని సూచించారు చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌స్తుతం పతంజ‌లి అన్ని ప్రొడ‌క్టుల‌ను త‌యారు చేస్తోంది. ఈ మేర‌కు ఆరోగ్య రంగానికి కూడా విస్త‌రించింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా ఆరోగ్య, ఫుడ్ ప్రాసెసింగ్ పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వ్యాప్తంగా వెల్ నెస్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు హామీ ఇచ్చారు రామ్ దేవ్ బాబా. క‌రోనా స‌మ‌యంలో కూడా ప‌తంజ‌లి కీల‌క పాత్ర పోషించింది.

పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌తంజ‌లి సంస్థ అధినేత రామ్ దేవ్ బాబా హామీ ఇచ్చారు. భారీ ఎత్తున మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ముందుకు రావ‌డం ప‌ట్ల సంతోషం , ఆనందం వ్య‌క్తం చేశారు ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.