NEWSNATIONAL

మ‌రాఠా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

Share it with your family & friends

రాజీనామా చేసిన ర‌వి రాజా

మ‌హారాష్ట్ర – మ‌హారాష్ట్ర‌లో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ ఊహించ‌ని షాక్ త‌గిలింది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్నారు ర‌వి రాజా. తాను ఇక పార్టీలో ప‌ని చేయ‌లేనంటూ ప్ర‌క‌టించారు . ఈ మేర‌కు గురువారం త‌న రాజీనామా లేఖ‌ను కాంగ్రెస్ పార్టీకి స‌మ‌ర్పించారు. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు పంపించారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆయన ఇవాళ‌ కాషాయ పార్టీలో చేరారు. దీంతో పార్టీకి సంబంధించి ఆయ‌న చ‌ర్చ‌నీయాంశంగా మారారు. మ‌రో వైపు ఈసారి కూడా ఎలాగైనా స‌రే మ‌రాఠాలో ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్లాన్ చేస్తోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఇందులో భాగంగా ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీల‌క‌మైన నేత‌ల‌ను త‌మ పార్టీ వైపు మ‌ళ్లించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్.

ప్ర‌స్తుతం శివ‌సేన పార్టీకి చెందిన ఏక్ నాథ్ షిండేతో క‌లిసి ప్ర‌భుత్వంలో కొన‌సాగుతోంది బీజేపీ. ఫ‌డ్న‌వీస్ ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో బీజేపీ ఎక్కువ సీట్ల‌ను కైవ‌సం చేసుకోగ‌లిగితే ఇక ప‌వ‌ర్ మ‌రోసారి త‌న చేతిలో వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు ఫ‌డ్న‌వీస్.