వన్ నేషన్ వన్ సివిల్ కోడ్ – మోడీ
త్వరలో భారత్ వన్ ఎలక్షన్ కూడా
ఢిల్లీ – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ సంచలన ప్రకటన చేశారు. దేశంలో అంతర్గతంగా ఇబ్బందులు సృష్టించే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా త్వరలోనే భారత దేశంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి) అమలు చేస్తామన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
దీపావళి పండుగ సందర్బంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఐక్యతా దినోత్సవం రోజున ప్రధాని భారీ ప్రకటన చేశారు. అడవిలో ఉన్న నక్సలైట్లను ఏరి పారేశామని, ఇక అర్బన్ నక్సల్స్ ను గుర్తించి వారి ముసుగు తీస్తామని హెచ్చరించారు మోడీ.
దేశాన్ని అస్థిర పరిచే లక్ష్యంతో భారతదేశం లోపల, వెలుపల ఉన్న విభజన శక్తులను హెచ్చరిస్తున్నానని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
భారత దేశం ఎవరికీ తలవంచదని స్పష్టం చేశారు. తాము నిర్భర్ భారత్ కింద తాము స్వయం సమృద్దిని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు పీఎం.