ప్రపంచం విస్తు పోయేలా భారత్ – మోడీ
ఏక్ తా దివస్ లో ప్రధానమంత్రి కామెంట్
ఢిల్లీ – యావత్ ప్రపంచం విస్తు పోయేలా ప్రస్తుతం భారత దేశం పురోగమిస్తోందని అన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. గురువారం కెవాడియాలో జరిగిన ఏక్తా దివాస్ పరేడ్‌కు హాజరై ప్రసంగించారు. అంతకు ముందు దేశ ఆర్మీ జవాన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు నరేంద్ర మోడీ.
ఈ సందర్బంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధానమంత్రి. 143 కోట్ల మంది భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మన దేశం బలం, ఐక్యతను చాటుతుందన్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి మనందరి మనసుల్లో బలంగా ప్రతిధ్వనిస్తోందన్నారు నరేంద్ర మోడీ.
దేశ రక్షణలో సైనికులది కీలకమైన పాత్ర అని కొనియాడారు. వారిని ఎన్నడూ విస్మరించ లేమన్నారు ప్రధానమంత్రి. జాతి రక్షణ కోసం బలిదానం చేసుకున్న, అమరులైన వీర మరణం పొందిన పోలీసులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు ప్రధానమంత్రి.
ఈ దేశం ఉన్నంత వరకు సూర్య చంద్రులు ఉన్నంత దాకా మీరు చేసిన బలిదానాలు, త్యాగాలు ఈ జాతి గుర్తు పెట్టుకుంటుందన్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.