కన్నడ రాజ్యోత్సవం ప్రత్యేకం – మోడీ
దీపావళి సందర్బంగా శుభాకాంక్షలు
ఢిల్లీ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నడ రాజ్యోత్సవం సందర్బంగా అభినందనలు తెలిపారు. శుక్రవారం ఆయన దీపావళి పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి.
ఈ సందర్బంగా కర్ణాటక రాష్ట్ర వాసులకు కంగ్రాట్స్ తెలిపారు. కన్నడ రాజ్యోత్సవం చాలా ప్రత్యేకమైన సందర్భం అని పేర్కొన్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఇది కర్ణాటక ఆదర్శ ప్రాయమైన సంస్కృతి , సంప్రదాయాలను గుర్తిస్తుందని స్పష్టం చేశారు.
కర్ణాటక రాష్ట్ర ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉందని పేర్కొన్నారు మోడీ. ఈ రాష్ట్రం మహనీయులతో నిండి ఉందని, వారి ఆచరణాత్మకమైన , స్పూర్తి దాయకమైన జీవితాలను ఆదర్శ ప్రాయంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
కన్నడ వాసులు ప్రత్యేకత కలిగిన వారని, వారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు ప్రధానమంత్రి. వారు కష్ట జీవులని , వారు ఎల్లవేళలా స్పూర్తి దాయకంగా ఉంటారని పేర్కొన్నారు.