జాస్ బట్లర్ కు రాజస్థాన్ బిగ్ షాక్
యువ ఆటగాళ్లకు రూ. 18 కోట్లు
హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది. గత ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన జోస్ బట్లర్ ను వేలం పాటకు వదలి వేసింది. ఇక యువ ఆటగాళ్లకు రూ. 18 కోట్ల చొప్పున చెల్లించేందుకు సిద్దమైంది. ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న సంజూ శాంసన్ కు రూ. 18 కోట్లు, యశస్వి జైస్వాల్ కు రూ. 18 కోట్లు వెచ్చించనుంది.
జోస్ బట్లర్ ను రిటైన్ చేసుకోక పోవడం విస్తు పోయేలా చేసింది. రియాన్ పరాగ్ , ధృవ్ జురైల్ కు రూ. 14 కోట్లు, విండీస్ బ్యాటర్ షిమ్రోన్ కు రూ. 11 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. ఇక అన్ క్యాప్డ్ ప్లేయర్ గా సందీప్ శర్మకు రూ. 4 కోట్లు , స్పిన్నర్ చాహల్, అశ్విన్ లకు నిరాశ తప్పలేదు. ఇదిలా ఉండగా రాజస్థాన్ మొత్తం రూ. 79 కోట్లు వీరిపై ఖర్చు చేయగా.. రూ. 41 కోట్లతో మెగా వేలంలోకి అడుగు పెట్టనుంది.
రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్టు ఇలా ఉంది. డోనోవన్, ఫెర్రెరియా, జోస్ బట్లర్ , అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, చాహల్, ఆవేశ్ ఖాన్, రోవ్ మన్ , దూబే, కాడ్ మోర్, ముష్తక్, బర్గర్, తనుష్ కోటియన్ , కేశవ్ మహరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆడమ్ జంపా ఉన్నారు.