NEWSNATIONAL

బీఎంటీసీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అవార్డు

Share it with your family & friends

జాతీయ స్థాయిలో కీల‌క పుర‌స్కారం

క‌ర్ణాట‌క – విశిష్ట సేవ‌లు అందించినందుకు గాను జాతీయ స్థాయిలో అవార్డు ల‌భించింది బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) కి. ఈ సంద‌ర్బంగా ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్‌తో “సిటీ విత్ బెస్ట్ రికార్డ్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఇన్ ట్రాన్స్‌పోర్ట్” విభాగంలో ఈ గౌర‌వం ద‌క్కింది.

ర‌వాణా ప‌రంగా ప్ర‌యాణీకుల‌కు విశిష్ట సేవ‌లు అందించ‌డం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడ‌డం, ప్ర‌యాణీకుల అభిరుచుల‌కు అనుగుణంగా ట్రాన్స్ పోర్ట్ సేవ‌లు అందించ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించింది బీఎంటీసీ.

దేశ వ్యాప్తంగా సిటీ విత్ బెస్ట్ రికార్డ్ ఆఫ్ ప‌బ్లిక్ ఇన్వాల్వ్ మెంట్ ఇన్ ట్రాన్స్ పోర్ట్ కోసం పోటీ ప‌డ్డాయి. కానీ అన్ని రాష్ట్రాల‌కు చెందిన న‌గ‌రాల‌ను దాటుకుని బెంగ‌ళూరు మెట్రో పాలిట‌న్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేష‌న్ ముందు నిలిచింది. దీంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పుర‌స్కారానికి ఎంపిక చేసింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌, ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ బీఎంటీసీకి అవార్డు ద‌క్క‌డం ప‌ట్ల అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.