ENTERTAINMENT

దీపావ‌ళి వేడుక‌ల్లో మెగా ఫ్యామిలీ

Share it with your family & friends

పండుగ వేళ ఆనంద హేళ

హైద‌రాబాద్ – మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఫోటోను పంచుకున్నారు. దీపావ‌ళి పండుగ సంద‌ర్బంగా త‌మ కుటుంబానికి చెందిన వారంతా ఒకే చోటుకు చేరారు. వీరంతా పండుగ‌ను ఆస్వాదించారు. ఈ సంద‌ర్బంగా త‌మ త‌ల్లితో క‌లిసి ఫోటో దిగారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫోటోల‌ను షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. పండుగ సంద‌ర్బంగా ఈసారి త‌మ‌కు ప్ర‌త్యేక‌మ‌ని పేర్కొన్నారు మెగాస్టార్. దీనికి కార‌ణం ఏమిటంటే త‌మ సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ రాష్ట్రానికి ఉప ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు. దీంతో పాటు అత్యున్న‌త‌మైన ప‌ద్మ‌భూష‌న్ అవార్డును పొందారు. కేంద్ర స‌ర్కార్ ఈ అవార్డును ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉండ‌గా ఈసారి జ‌రిగిన దీపావ‌ళి పండుగ సంద‌ర్బంగా మెగాస్టార్ చిరంజీవి, సోద‌రులు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్, కొణిదెల నాగ బాబు తో పాటు చెల్లెల్లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా తెలుగు వారంద‌రికీ దీపావ‌ళి ప‌ర్వ దినాన్ని పుర‌స్క‌రించుకుని శుభాకాంక్ష‌లు తెలిపారు.