NEWSTELANGANA

త్వ‌ర‌లో రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర

Share it with your family & friends

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన కేటీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల ఆకాంక్ష‌ల మేర‌కే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. ఎక్స్ వేదిక‌గా ఆస్క్ కేటీఆర్ సంద‌ర్బంగా ప‌లువురు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారింద‌ని ఆరోపించారు. పాల‌న పూర్తిగా గాడి త‌ప్పింద‌న్నారు.
తాము గ‌త 10 ఏళ్ల‌లో నిర్మించిన తెలంగాణ‌ను స‌ర్వ నాశ‌నం చేసే దిశ‌గా ప్ర‌స్తుత స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు.

ప్రజల పక్షాన కోట్లాడడమే ప్రస్తుతం త‌మ ముందున్న బాధ్య‌త‌గా ఆయ‌న పేర్కొన్నారు. బీఆర్ఎస్ తిరిగి ప‌వ‌ర్ లోకి రావ‌డం త‌ప్ప‌ద‌న్నారు. త‌న తండ్రి, పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నార‌ని ఆయ‌న ఆరోగ్యానికి వ‌చ్చిన ముప్పేమీ లేద‌న్నారు.

పార్టీ నేత‌ల‌పై వేధింపులు, అక్ర‌మంగా కేసులు పెడుతున్న పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ గాడి త‌ప్పింద‌న్నారు. త‌మ సోష‌ల్ మీడియా వారియ‌ర్లు అద్భుతంగా ప‌ని చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు.