DEVOTIONAL

టీటీడీ అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌రిపించాలి

Share it with your family & friends

కొత్త చైర్మ‌న్ బీఆర్ నాయుడుకు కంగ్రాట్స్

అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, న‌టుడు కొణిదెల నాగ‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి నూత‌న చైర్మ‌న్ గా ప్ర‌ముఖ మీడియా సంస్థ అధినేత బీఆర్ నాయుడును ప్ర‌భుత్వం నియ‌మించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో తిరుమ‌ల‌లో చోటు చేసుకున్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని కొణిదెల నాగ బాబు డిమాండ్ చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మ‌న్ తో పాటు 24 మంది స‌భ్యుల‌ను నియ‌మించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. నిబ‌ద్ద‌త‌తో స్వామి వారి సేవ‌కు పాత్రులు కావాల‌ని, గ‌తంలో జ‌రిగినట్లు భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని కోరారు.

సరైన వ్యక్తికి సరైన సమయంలో సరైన గౌరవం లభించినందుకు చాల‌ సంతోషంగా ఉందన్నారు ఆయ‌న బీఆర్ నాయుడు నియామ‌కంపై . మునుపు ఉన్న అవకతవకలన్నింటిని సరిచేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ ని మరింత మెరుగు పరచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాన‌ని, మీకు కంగ్రాట్స్ తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు కొణిదెల నాగ బాబు.

అలాగే జనసేన తరపున తితిదే సభ్యులుగా ఎన్నికైన బురగపు ఆనంద సాయి, అనుగోలు రంగశ్రీ, మహేందర్ రెడ్డికి, సభ్యులు గా ఎన్నికైన అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.