NEWSTELANGANA

ఉద్యోగాల ఊసేది నిరుద్యోగుల‌కు దిక్కేది

Share it with your family & friends

నిప్పులు చెరిగి భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ పార్టీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ కొలువు తీరి 11 నెల‌లు గ‌డిచానా ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌ని పేర్కొంది. ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు, ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇవ్వ‌డం త‌ప్పా చేసింది ఏమీ లేదంటూ ఆరోపించింది.

కేసీఆర్‌ పాలనలో కొలువుల ఖిల్లాగా ఉన్న తెలంగాణ.. అసమర్థ రేవంత్ పాలనలో ఇప్పుడు నిరుద్యోగానికి అడ్డాగా మారిందని ఆవేద‌న వ్య‌క్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ. గడిచిన పదేండ్ల పాలనలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో మొత్తంగా 25 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తే , కాంగ్రెస్ పాల‌న‌లో ఉన్న ఉద్యోగాలు ఊడి పోయే ప‌రిస్థితి నెల‌కొంద‌ని వాపోయింది.

ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామ‌న్నారని, ఏటా జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పిన స‌ర్కార్ దాని ఊసెత్త‌డం లేద‌న్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పరీక్షలను కూడా తమ ఖాతాలో వేసుకొంటూ వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు బండారం వెలుగులోకి వచ్చిందని పేర్కొంది.

గత పదేండ్లలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు కేరాఫ్‌గా నిలిచిన తెలంగాణ ఇప్పుడు నిరుద్యోగానికి అడ్డాగా మారిందని , నిరుద్యోగితలో దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అధ్వాన్న పరిస్థితులు నెలకొనడమే దీనికి నిదర్శనమ‌ని మండిప‌డింది.