NEWSTELANGANA

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం

Share it with your family & friends

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ అంటూ మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశాలు ఏమాత్రం లేవన్నారు.

అందుకే అబద్ధాల మీద, అసత్యాల మీద సమయం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గత పది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదన్నారు.

అబద్ధపు హామీల మీద ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేమన్నారు కేటీఆర్. తమ వైఫల్యాలను కప్పిపుచ్చు కునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించింది అన్నారు. అయితే వీటికి భయపడేది లేదని కేటీఆర్ అన్నారు.

సన్న వడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్ గా మారిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక రైతుబంధు లేక నష్టపోతున్న రైతన్నల తరఫున పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ పాలనలో జరిగుతున్న  పతనం నుంచి తెలంగాన కోలుకోవడం అసాద్యం అన్నారు.

నాలుగు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడం ఖాయమని అయితే కొత్త ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేసిన నష్టం నుంచి తెరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాలుగా మారుతుందని కేటీఆర్ అన్నారు.