NEWSTELANGANA

తెలంగాణ‌లో ఉచిత ప‌శు వైద్య శిబిరాలు

Share it with your family & friends

ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌వ్య‌సాచి ఘోష్

హైద‌రాబాద్ – రాష్ట్రంలో పాడి రైతులు పాల ఉత్పత్తిలో గణనీయ ప్రగతిని సాధించారని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ అన్నారు. సచివాలయంలో “ఉచిత పశువైద్య శిబిరాలు పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. రాష్ట్రంలో పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నదని తెలిపారు.

ముఖ్యమంత్రి శ రేవంత్ రెడ్డి గారు 2024-25 బడ్జెట్ లో 1980 కోట్లు రూపాయలు పశు సంవర్థక శాఖ కు ప్రత్యేకంగా కేటాయించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రీయ గోకుల్ మిషన్” సహకారంతో రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో 2210 ఉచిత పశువైద్య గర్భకోశ శిబిరాలు అక్టోబర్ 25 నుండి ఫిబ్రవరి 28,2025 వరకు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ వైద్య శిబిరాలలో దీర్ఘకాలికంగా ఎదకు రాకుండా గర్భం దాల్చని పశువులను గుర్తించి, వాటికి తగు చికిత్స చేయడం, ఎదలో వున్న పశువులలో కృత్రిమ గర్భధారణలు చేయడం, చూడి పరీక్షలు, దూడలకు నట్టల నివారణ మందులు, విటమిన్ ఇంజెక్షన్లు, పాడి పశువులలో పాల దిగుబడి పెంచడానికి ఖనిజ లవణ మిశ్రమాలు అందించడం, ఇతర చికిత్సలు చేయడం జరుతుందని తెలిపారు.

300 ఎంపిక చేసిన గ్రామాలలో కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడల ప్రదర్శన, పాడిపశువులలో పాల దిగుబడి పోటీలు నిర్వహించి రైతులకు కృత్రిమ గర్భధారణపై, అధిక పాల దిగుబడినిచ్చే మేలుజాతి పాడిపశువులపైన అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.