రహదారుల అభివృద్దికి పెద్దపీట
ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి – రహదారుల అభివృద్దికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. శనివారం విశాఖపట్నంలో గుంతలకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
వన్ టౌన్ రామకృష్ణ జంక్షన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ టి.శివశంకర్, జనసేన పిఎసి సభ్యులు కోన తాతారావు, ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి సత్య, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్, పార్టీ నేతలు పసుపులేటి ఉషా కిరణ్, కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గత వైఎస్ జగన్ రెడ్డి సర్కార్ రహదారులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దీంతో ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడ్డాయని,, మరమ్మతులు చేసే ఆలోచన కూడా చేయలేక పోయిందన్నారు నాదెండ్ల మనోహర్.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది చాలక ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి పెట్టారంటూ ఫైర్ అయ్యారు. ఏపీ కూటమి సర్కార్ రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పై దృష్టి సారించిందని అన్నారు.