NEWSTELANGANA

సీఎం కామెంట్స్ లో నిజం లేదు – హ‌రీశ్

Share it with your family & friends

కొలువుల భ‌ర్తీ విష‌యం అంతా అబ‌ద్దం

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయ‌న కాంగ్రెస్ స‌ర్కార్ ను, సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. శ‌నివారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. బీఆర్ఎస్ స‌ర్కార్ 10 ఏళ్ల‌లో 1,60,000 జాబ్స్ ను భ‌ర్తీ చేసింద‌ని చెప్పారు. కానీ మీరు మాత్రం తాము వ‌చ్చాక వేలాది ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని చెప్ప‌డం పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని పేర్కొన్నారు హ‌రీశ్ రావు.

మీరు భ‌ర్తీ చేసిన‌ట్లు చెప్పిన ఆ 50,000 ఉద్యోగాలు గ‌త కేసీఆర్ హ‌యాంలో నోటిఫై చేసి, ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, స‌ర్టిఫికెట్లు పూర్తి చేసింది నిజం కాదా అని ప్ర‌శ్నించారు. ఇలా చెప్పుకుంటే ఎలా అని నిల‌దీశారు హ‌రీశ్ రావు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో ఉన్న అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వ‌కుండా నిలిపి వేయాల్సి వ‌చ్చింద‌న్నారు. కానీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక సీఎం వాటిని తామే భ‌ర్తీ చేశామ‌ని గొప్ప‌లు చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. మీరు తెలంగాణ‌నే కాదు ఉద్యోగాల విష‌యంలో దేశాన్నే మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు.

కాగా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా జారీ చేయలే పోయింద‌న్నారు.

డిసెంబరు 9, 2023 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది, కానీ వాగ్దానం చేసిన మొత్తంలో సగం కూడా ఇవ్వలేదన్నారు.

కాంగ్రెస్ వృద్ధాప్య పింఛను రూ. నెలకు 4,000 ఇస్తాన‌ని ప్ర‌క‌టించింద‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు దాని ఊసే లేద‌న్నారు. 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలకు 2,500 పెన్ష‌న్ ఇస్తామ‌న్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు దాని జాడ లేద‌న్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన హామీల‌కు లెక్కే లేద‌న్నారు.