NEWSTELANGANA

కుల గ‌ణ‌న పార‌దర్శ‌కంగా జ‌ర‌గాలి

Share it with your family & friends

మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్ డిమాండ్

హైద‌రాబాద్ – కుల గ‌ణ‌న‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మాజీ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కుల గ‌ణ‌న‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం రెండు నాల్క‌ల ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆరోపించారు. హైకోర్టు కుల గ‌ణ‌న‌కు సంబంధించి కీల‌క తీర్పు వెలువ‌రించింద‌ని అన్నారు. ప్ర‌భుత్వం రెండు వేర్వేరు జీవోలు ఇవ్వ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేశారు వి. శ్రీ‌నివాస్ గౌడ్.

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, చాలా రోజుల తర్వాత బీసీ జనాభా లెక్కించడానికి బీసీ కమిషన్ ఏర్పాటు చేశార‌ని అన్నారు. హైకోర్టు కులగణన సర్వే కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని స్ప‌ష్టం చేసింద‌ని కానీ స‌ర్కార్ ఆ దిశ‌గా ఆలోచించ‌డం లేద‌ని ఆరోపించారు వి. శ్రీ‌నివాస్ గౌడ్.

మళ్ళీ కాలయాపన జరిగే ప్రమాదం ఉందని అట్టడుగు వర్గాల్లో ఆందోళన నెల‌కొంద‌న్నారు. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కుల గణనలో చేసిన తప్పిదాలే ఇక్కడ చేస్తున్నారని ఆరోపించారు వి. శ్రీ‌నివాస్ గౌడ్. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

రాహుల్ గాంధీ కుల గణన ఓ ఎక్స్ రే లాంటిదని అంటున్నారని, కానీ తాము దానిని ఎంఆర్ఐ లాంటిదని అంటున్నామ‌ని చెప్పారు. కులాలు, ఉపకులాల జనాభా సర్వేతో కచ్చితంగా తేలుతుందన్నారు. తప్పిదాలు చేయకుండా సెన్సస్ జాగ్రత్తగా చేయాలని సూచించారు.

బీసీ కమిషన్ ను ఆయా జిల్లాల్లో క‌లెక్ట‌ర్లు ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఆరోపించారు. బీసీ క‌మిష‌న్ ను అవ‌మానించిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేశారు వి. శ్రీ‌నివాస్ గౌడ్. రాజ్యాంగం ఆర్టికల్ 243, 342 ల ప్రకారం బీసీ కుల గణనను పకడ్భందిగా చేయాలని అన్నారు.