సినిమాల పేర్లు వద్దు దైవ నామం ముద్దు
పిలుపునిచ్చిన కొణిదెల పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా అభిమానులకు ఆయన షాక్ ఇచ్చారు. ఇక నుంచి సినిమాల పేర్లు, నటీ నటుల పేర్లు జపించడం మానేయాలని సూచించారు. వీటికి బదులు నిరంతరం దైవ నామం జపించాలని కోరారు. దీని వల్ల మనసు తేలిక అవుతుందని, జీవితం ప్రశాంతంగా గడుస్తుందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తమపై బురద చల్లేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు కొణిదెల పవన్ కళ్యాణ్. వారి తాట తీస్తామన్నారు. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక సర్కార్ కాదన్నారు డిప్యూటీ సీఎం.
వైసీపీ వాళ్లకు యుద్దమే కావాలని అనుకుంటే తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఎవరికీ తాను భయపడే ప్రసక్తి లేదన్నారు. తాడో పేడో తేల్చుకునేందుకు రెడీగా ఉన్నానని చెప్పారు పవన్ కళ్యాణ్ కొణిదెల.
రాజకీయ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేదా తాము చేసే పనుల్లో తప్పులు ఉన్నట్లయితే ఎత్తి చూపాలని కానీ పదే పదే తమను టార్గెట్ చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగుతామంటే ఊరుకోనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తోలు తీస్తానని అన్నారు.