ఐటీ సెక్టార్ లో ఏపీ నెంబర్ వన్ కావాలి
స్పష్టం చేసిన ఐటీ మంత్రి నారా లోకేష్
అమరావతి – ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ సెక్టార్ లో దేశంలోనే ఏపీ రాష్ట్రం నెంబర్ వన్ గా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పెట్టుబడిదారులు, కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామని అన్నారు .
అమెరికాలో సాంకేతికతను అనుసంధానం చేయడం , ఉద్యోగాలను సృష్టించడం ద్వారా అభివృద్ది పథంలో పయనిస్తోందని పేర్కొన్నారు. ఇదే సాంకేతికతను రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే కొన్ని ప్రాజెక్టులకు వర్తింప చేసేలా చూడాలని స్పష్టం చేశారు నారా లోకేష్.
అత్యంత అనుకూలమైన వైఖరితో ఉన్నామని, వనరులను గుర్తించి వాటిని వాడుకునేలా తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి. దార్శనికత, ముందు చూపు , అభివృద్ది చేయాలన్న సత్ సంకల్పం కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు నారా లోకేష్.
ప్రవాస భారతీయులు, ప్రవాస ఆంధ్రులు ఎవరైనా సరే తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావచ్చని, ఫ్రెండ్లీ ఇన్వెస్టర్స్ పాలసీని తీసుకు వచ్చామని స్పష్టం చేశారు.