NEWSINTERNATIONAL

అపూర్వ ఆద‌ర‌ణ అనూహ్య స్పంద‌న

Share it with your family & friends

అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్

అమెరికా – అమెరికాలో రోజు రోజుకు ప్ర‌చారం ఊపందుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతోంది. బ‌రిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ కు రోజు రోజుకు జ‌నాద‌ర‌ణ పెరుగుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ట్రంప్ నార్త్ క‌రోలినాకు విచ్చేసిన ఆయ‌న‌కు భారీ ఎత్తున స్వాగ‌తం ప‌లికారు.

ఈ సంద‌ర్బంగా డొనాల్డ్ ట్రంప్ ప్ర‌సంగించారు. ఇవాళ త‌న మ‌న‌సు సంతోషంతో పుల‌కించి పోయింద‌న్నారు. ఇంత పెద్ద ఎత్తున త‌న ప‌ట్ల ప్రేమ క‌లిగి ఉన్నార‌ని, మ‌ద్ద‌తు ఇస్తార‌ని తాను క‌ల‌లో కూడా అన్న‌లేద‌ని చెప్పారు డొనాల్డ్ ట్రంప్.

బైడెన్, క‌మ‌లా హారీస్ మాట‌ల వ‌ర‌కే ప‌రిమితం అయ్యార‌ని, అమెరికా దేశ ప‌రువు గంగ‌లో క‌లిపారంటూ నిప్పులు చెరిగారు. వారిని తిరిగి ఎన్నుకుంటే మీకు భ‌విష్య‌త్తు అంటూ ఉండ‌ద‌న్నారు. తాను వ‌చ్చిన వెంట‌నే యుఎస్ కు పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆరు నూరైనా స‌రే తాను అనుకుంటే చేసి తీరుతాన‌ని చెప్పారు.

పేరుకు పోయిన ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అంతం చేస్తాన‌ని మీ అంద‌రికీ ఈ వేదిక నుంచి మాట ఇస్తున్నాన‌ని తాను ఇక త‌ప్ప‌న‌ని ప్ర‌క‌టించారు డొనాల్డ్ ట్రంప్.