అభివృద్ది..సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
కర్నూలు జిల్లా – అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. ఆదివారం కర్నూలు జిల్లా డోన్ లో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. 100 పడకల ఆస్పత్రితో సహా ఒకే రోజు రూ. 102 కోట్లతో కీలకమైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు హయాంలో డోన్ అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి లోనైందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాను వచ్చాక దాని రూపు రేఖలు మార్చానని అన్నారు. నాప రాయి, మట్టి, సున్నపు రాయి పరిశ్రమలకు కూడా ఊతం ఇచ్చామన్నారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.
డోన్ ప్రజల సహాయ సహకారం అందించడం వల్లనే ఇవాళ ఇన్ని అభివృద్ది పనులను చేపట్టడం జరిగిందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ప్రజలు గెలిపించడం వల్లనే శాశ్వతంగా నిలిచి పోయే పనులు చేపట్టడం జరిగిందన్నారు.