టీటీడీ చైర్మన్ కు ఎమ్మెల్యే కంగ్రాట్స్
పూర్వ వైభవాన్ని తీసుకు రావాలి
హైదరాబాద్ – కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బి. జయ నాగేశ్వర్ రెడ్డి ఆదివారం మర్యాద పూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్ గా నియమితులైన టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడును కలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఆయనకు శాలువా కప్పి, పుష్ప గుచ్ఛం అందజేశారు. అనంతరం కీలక అంశాలపై చర్చించారు. టీటీడీకి పూర్వ వైభవాన్ని తీసుకు రావాలని, నిబద్దతతో టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలోని టీమ్ సమర్థవంతంగా కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు ఎమ్మెల్యే.
తమ కుటుంబానికి సన్నిహితుడిగా, మాజీ మంత్రి , దివంగత తన తండ్రి అయిన బీవీ మోహన్ రెడ్డి కి బీఆర్ నాయుడు మంచి మిత్రుడని, ఆయనతో కుటుంబ పరంగా సన్నిహిత సంబంధాలు తమకు ఉన్నాయని తెలిపారు ఎమ్మెల్యే .
ఎంతో అదృష్టం ఉంటే తప్పా టీటీడీ చైర్మన్ లాంటి అత్యున్నతమైన పదవి దక్కదన్నారు. బీఆర్ నాయుడు ఈ పదవిలో విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకున్నట్లు తెలిపారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే.