తిరుమల భక్తులతో కిటకిట
76 వేల 104 మంది దర్శనం
తిరుమల – ప్రసిద్ద పుణ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిటకిట లాడింది. రోజు రోజుకు భక్తులు పెరుగుతున్నారే తప్పా ఎక్కడా తగ్గడం లేదు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల.
స్వామి వారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్త బాంధవుల ప్రగాఢ విశ్వాసం. ఇదిలా ఉండగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 76 వేల 104 మంది దర్శించుకున్నారు. 32 వేల 412 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారికి నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 2.92 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. క్రిష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలో నిలిచి ఉన్నారు.
ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 24 గంటలకు పైగా సమయం పట్టనుందని టీటీడీ ధర్మ కర్తల మండలి ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.