వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు వ్యతిరేకం
తీర్మానాన్ని ఆమోదించిన టీవీకే
తమిళనాడు – తళపతి విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీ సంచలన ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ప్రస్తుతం సదరు పార్టీ ఏకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ (ఒకే దేశం ఒకే ఎన్నికలు ) అన్న నినాదాన్ని ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. దీనిని తమిళనాడుకు చెందిన పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.
తాజాగా విల్లుపురం జిల్లాలో ఏర్పాటు చేసిన టీవీకే మహానాడు సభ విజయవంతంగా జరిగింది. ఎవరూ ఊహించని రీతిలో భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఈ సందర్బంగా పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు తళపతి విజయ్ 50 నిమిషాల సేపు ప్రసంగించారు. ఆయన విద్య, ఆరోగ్యంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
ఆదివారం జరిగిన టీవీకే పార్టీ సమావేశంలో కీలక తీర్మానం చేసింది. ఒకే దేశం ఒకే ఎన్నికలకు వ్యతిరేకంగా తాము తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగిందని ప్రకటించింది టీవీకే పార్టీ. ఇదే సమయంలో తాము గనుక పవర్ లోకి వస్తే గవర్నర్ పదవిని తొలగిస్తానని స్పష్టం చేశారు తళపతి విజయ్. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా కూడా తీర్మానం చేయడం విశేషం.