NEWSINTERNATIONAL

క‌మ‌లా హారీస్ గెలిస్తే ఆర్థిక మాంద్యం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా – అమెరికా మాజీ అధ్య‌క్షుడు ప్ర‌స్తుత అధ్య‌క్ష బ‌రిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా ఉన్న ప్ర‌స్తుత ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారీస్ పై నిప్పులు చెరిగారు. ఆమెను గ‌నుక మీరు ఎన్నుకుంటే ఇక అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళుతుంద‌ని అమెరిక‌న్ల‌కు హెచ్చ‌రించారు.

మీరంతా 1929 త‌ర‌హా ఆర్థిక మంద్యానికి వెళ్లి పోతార‌ని, మీ విలువైన ఓటును త‌న‌కు వేసి గెలిపించాల‌ని కోరారు డొనాల్డ్ ట్రంప్. ఒక‌వేళ త‌న‌ను గెలిపిస్తే గ‌నుక మీకు అత్యున్న‌త‌మైన ఉద్యోగాల‌ను క‌ల్పిస్తాన‌ని, భారీ వేత‌నాలు అంద‌జేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ప్రపంచం ఇప్పటి వరకు చూడని ఉజ్వలమైన ఆర్థిక భవిష్యత్తుకు కేవ‌లం మూడు రోజుల దూరంలో ఉంటారని అన్నారు . క‌మ‌లా హారీస్ నిర్వాకం కార‌ణంగా ఇవాళ అమెరికా ప‌రువు దారుణంగా ప‌డి పోయింద‌న్నారు. సాధార‌ణ అమెరిక‌న్ కుటుంబానికి 30 వేల డాల‌ర్లు ఖ‌ర్చు అవుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు డొనాల్డ్ ట్రంప్.

తాను వ‌స్తే కార్మికులు, చిన్న వ్యాపారాల కోసం ప‌న్నుల‌ను భారీగా త‌గ్గిస్తాన‌ని చెప్పారు. ఓవ‌ర్ టైమ్ పై ప‌న్ను ఉండ‌ద‌ని, సామాజిక భ‌ద్ర‌త ప్ర‌యోజ‌నాల‌పై కూడా ప‌న్ను అంటూ విధించ బోమంటూ స్ప‌ష్టం చేశారు .