ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం అబద్దం
కీలక ప్రకటన చేసిన హెచ్ఎండీఏ
హైదరాబాద్ – హెచ్ఎండీఏ సంచలన ప్రకటన చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీలలో అనధికార లేఅవుట్లలో ప్లాట్ ల రిజిస్ట్రేషన్లను నిషేధించినట్లు వస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దమని స్పష్టం చేసింది. ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. .
దీనికి సంబంధించి .. గత సంవత్సర కాలంగా హెచ్‌ఎండీఏ నుండి రిజిస్ట్రేషన్ , స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థనను పంప లేదని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీల్లో అనధికారిక లేఅవుట్‌ల ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కింది.
ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవాలు అని స్పష్టం చేసింది హెచ్ఎండీఏ. ఇలాంటి నిరాధారమైన, సత్య దూరమైన పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విన్నవించారు. మీడియా సంస్థలు కూడా దీనిని గమనించాల్సిందిగా కోరింది.
అధికారికంగా ఎలాంటి ప్రకటన తాము జారీ చేయలేదని తెలిపింది.