NEWSANDHRA PRADESH

యువ‌కుల దుర్మ‌ర‌ణం బాధాక‌రం

Share it with your family & friends

మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌లపూడి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ షాక్ తో యువకులు మృతి చెంద‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
సామాజిక విప్లవకారుడు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో ఘటన జరగడం బాధాక‌ర‌మ‌న్నారు.
ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలను ఆదుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్బంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హోంమంత్రి ఆదేశించారు. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు మృతి చెందిన ఘటనపై వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో భాగంగా ప్రమాదం జరగడం చాలా బాధకరమన్నారు.ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో మరణించిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె స్పష్టం చేశారు.

ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు ప్రమాదవశాత్తు అకాల మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు తట్టుకునే ధైర్యం వారి తల్లిదండ్రులకు భగవంతుడు ప్రసాదించాలని వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తణుకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించి కాపాడాలని ఆదేశించారు.