వంశీ కామెంట్స్ డీకే అరుణ సీరియస్
చిల్లర రాజకీయాలు మానుకోవాలి
హైదరాబాద్ – బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీ చందర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం డీకే అరుణ మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎవరు ఎలాంటి వారనేది ప్రజలకు తెలుసన్నారు. చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే తన టికెట్ ఇచ్చేస్తాడన్న పేరు తనకు ఉందని, ఇది తాను అనడం లేదని కల్వకుర్తి నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారని అన్నారు.
ఆనాడు తన వల్లనే కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచానన్న సంగతి మరిచి పోతే ఎలా అని వంశీ చందర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తాను ఎంపీగా నిలబడితే ఓకే..కానీ తాను ఓడి పోవడం ఖాయమని తెలిసి పోయిందని అందుకని తనను టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు డీకే అరుణ. ఇకనైనా ఏదైనా ఆధారాలతో ఆరోపణలు చేస్తే తాను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
ఏ గుడికైనా వస్తానని స్పష్టం చేశారు మాజీ మంత్రి , జాతీయ ఉపాధ్యక్షురాలు.