నేనే హోం మంత్రినైతే ఇలా ఉండదు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్
అమరావతి – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల. సోమవారం మీడియాతో మాట్లాడారు. తాను గనుక హోం శాఖ మంత్రిని గనుక అయితే సీన్ వేరేలా ఉంటుందన్నారు. ఆయన పరోక్షంగా అనితను ఉద్దేశించి కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది.
తనకు గనుక హోం శాఖ తీసుకుంటే సీన్ వేరేలా ఉంటుందన్నారు. విమర్శలు, ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. హోం మంత్రి అనిత రివ్యూ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని అన్నారు. అది గనుక కంట్రోల్ లేక పోతే ఇబ్బందులు ఏర్పడుతాయని చెప్పారు పవన్ కళ్యాణ్.
ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి. సంఘ వ్యతిరేక శక్తులను కంట్రోల్ చేయాలి. రేయింబవళ్లు కష్ట పడాలని సూచించారు. మొత్తంగా హోం శాఖ మంత్రి అనిత వంగలపూడికి చెక్ పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం. ప్రస్తుతం ఆయన పంచాయతీరాజ్ శాఖను చూస్తున్నారు.