సంక్షేమ హాస్టళ్లను పరిశీలించండి – పవన్
ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలకు సూచన
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఏపీ హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి విఫలం చెందారంటూ ఆరోపించారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు అనిత వంగలపూడి.
ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. మెత్తదనం పనికి రాదని, విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో సంక్షేమ హాస్టళ్లను పరిశీలించాలని స్పష్టం చేశారు.
జనసైనికులు, వీర మహిళలు గెలవగానే మీ బాధ్యత అయి పోలేదన్నారు, మీరు ప్రజల్లో ఉండాలని, తన వద్ద ఉంటే కుదరదని అన్నారు. మనం ఓడిపోయిన సమయంలో మనకు అండగా నిలబడిన ప్రజలను మరిచి పోవద్దని సూచించారు పవన్ కళ్యాణ్.
వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరారు. హైదరాబాద్ , ఇతర ప్రాంతాలలో, విదేశాల నుంచి ప్రవాస ఆంధ్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, ఓటు వేసి గెలిపించారని అన్నారు.